వరంగల్

ఉమ్మడి జిల్లా స్వీప్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 8: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాలకు 12 స్థానాల్లో ప్రజాకూటమి అభ్యర్థులు గెలుపొందుతారని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం వరంగల్ డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ సరళి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాకూటమి అనుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించారని, ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ విషయంలో ఎలక్షన్ కమీషన్ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు. ఓటరు జాబితాలో కూడా జంబ్లింగ్ విధానాన్ని అనుసరించినట్లు ఉందని ఆయన ఎద్దెవా చేశారు. బార్యకు ఒక దగ్గర ఓటు ఉంటే భర్తకు మరో పోలింగ్ బూత్‌లో ఓటు ఉందని అన్నారు. ఇలాంటి తప్పిదాలు పెద్ద ఎత్తున జరిగాయని అన్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు డబ్బు, మధ్యం విచ్చ ల విడిగా పంపిణీ చేశారని అయినప్పటికి ఓటర్లు మహాకూటమి అభ్యర్ధులకే పట్టం కడుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని నియోజవర్గాలలో కూట మి అభ్యర్ధులు విజయం సాధిస్తారన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. సర్వేలు, ఎగ్జిట్ ఫోల్స్ ఎన్ని చెప్పిన అధికారంలోకి వచ్చేది మహాకూటమేనని అన్నారు. ఈ నెల 12న కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాకూటమి అభ్యర్ధుల గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్ధానం కల్పిస్తామన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు జక్కుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.