వరంగల్

చేపల పెంపకానికి సొసైటీలు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, జూన్ 17: ఏజన్సీ ప్రాంతాలలోని చేపల చెరువులను గుర్తించి చేపల పెంపకానికి సొసైటీలను ఏర్పాటుచేసి, ఆదివాసీలు చేపలను పెంచేవిధంగా మహిళా సంఘాలు కృషిచేయాలని ఐటిడిఎ పిఒ అమొయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఎ కార్యాలయంలో ఐకెపి, జిసిసి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పిఒ మాట్లాడుతూ ఏజన్సీ గ్రామాలలో 10వ, ఇంటర్ పూర్తిచేసిన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకుల వివరాలు సేకరించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలను ఈనెల చివరిలోగా 40% వసూలు చేయాలని వివోలు, ఎస్‌హెచ్‌జిలను ఆదేశించారు. పొదుపు సంఘాలను 100%గ్రేదింగ్ చేసిన వారికి మాత్రమే వేతనాలు ఇవ్వబడతాయని ఏరియా కో- ఆర్డినేటర్లను హెచ్చరించారు. ఏటూరునాగారం, కొత్తగూడ, తాడ్వాయి, గూడూరు, మంగపేట తదితర మండలాలలోని 94 డిఆర్‌సేల్స్ డిపోల ద్వారా నిత్యావసర సరుకుల అమ్మకాలు జరిపించి, సేల్స్ డిపోలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. సమావేశంలో ఎపిఒ వసంతరావు, జిసిసి జిల్లా మేనేజర్ ప్రతాపరెడ్డి, ఏరియా కో ఆర్డినేటర్లు గోవింద్‌చౌహాన్, వరలక్ష్మిలతో పాటు ఆయా మండలాలలకు చెందిన మండల సమాఖ్య ప్రాజెక్టు మేనేజర్లు, ఏరియా కో ఆర్డినేటర్లు, కమ్యూనిటి కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.