వరంగల్

మిషన్ కాకతీయతో పల్లెలకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, జూన్ 17: మిషన్ కాకతీయతో పల్లెల్లో జలకళ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ శాసనసభ్యులు డా. తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కన్నాయపల్లి గ్రామంలో గల చౌటకుంటలో రూ.30లక్షల వ్యయంతో చేపట్టే మిషన్ కాకతీయ రెండవ దశ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడన్నారు. చెరువుల పూడికతీతతో చెరువుల నీటి మట్టం పెరిగి రైతులు రెండు పంటలు వేసి ఆర్థికంగా ఎదుగుతారన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో పనులు చేస్తే సహించేది లేదన్నారు. మిషన్ కాకతీయ పనులపై రైతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన అన్నారు. కన్నాయపల్లి గ్రామంలో సిసి రోడ్లు, గబ్బెట-కన్నాయపల్లి తారురోడ్డు, కన్నాయపల్లి- భానాజీపేటకు తారురోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే బంగారు తెలంగాణను సాధిస్తామని, ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎప్పటికీ ఉండాలని కోరారు. అంతకు ముందు మండలంలోని కోమళ్ల గ్రామంలో కెసి ఆర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులను అందచేశారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో నూతనంగా డీలర్‌షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దాసరి అనిత, సర్పంచ్‌లు నల్లూరి కొంరమ్మ, సుల్తాన్ విజయలక్ష్మీ, మాచర్ల సోమలక్ష్మీ, ఎంపిటిసిలు రమాదేవి, పార్వతి, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు మారుజోడు రాంబాబు, చెంచు రమేష్, ఐబి ఎఈ జయ, నాయకులు పోకల శివకుమార్, పుండ్రు సంజీవరెడ్డి, రంగు అంజయ్య, గొరిగె రవి, హుస్సేన్‌నాయక్, బుగ్గయ్యలు పాల్గొన్నారు.