వరంగల్

బ్యాంక్‌ంగ్ రుణాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతగిరి, జూన్ 17: బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వచ్చే రుణాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. శుక్రవారం పర్వతగిరి మండలకేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని, మళ్లీ వాటిని సకాలంలో చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను రైతులు, వ్యాపారస్థులు, విద్యార్థులు అనుసందానించుకొని ఉపయోగించుకోవాలని అన్నారు. అదే విధంగా అర్హత కలిగిన రైతులకు వ్యవసాయ రుణాలు, చిరు వ్యాపారుల అబివృద్ధికి తోడ్పడే ముద్ర రుణాలను, నిరుద్యోగులకు రుణాల ద్వారా ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలకేంద్రానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు తీసుకరావడానికి సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు సౌత్ జోన్ ఇన్‌చార్జ్ వినోద్‌జోష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 6,990 బ్రాంచ్‌లు ఉన్నట్లు, వెయ్యి పైబడి ఏటిఎంల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్ జోన్ ఇన్‌చార్జ్ వి.ఎస్.శర్మ మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా పొదుపు ఖాతాలను, పంటల బీమా పథకాన్ని, జీవిత బీమా పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఎడ్యుకేషనల్ లోన్స్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం 77 మందికి 2 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళల కోసం కొత్త పొదుపు ఖాతాలను ఇస్తూ 5లక్షల బీను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి రంగు రజిత, సర్పంచ్ గోనె విజయలక్ష్మీ, ఎంపిటిసి రమేష్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఓ కృష్ణయ్య, పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, సిబ్బంది చైతన్య, జిల్లా నాయకులు యుగేందర్, రతన్‌రావు, జితేందర్‌రెడ్డి, మారినేని రవీందర్‌రావు, అశోక్‌రావు పాల్గొన్నారు.