వరంగల్

నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 17: గ్రేటర్ వరంగల్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేటర్లు, నగర ప్రజలు, అధికారులు సహకరించాలని మహానగరపాలక సంస్థ మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. పాలక మండలి ఏర్పడిన 92 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు వేసామని అన్నారు. గ్రేటర్ వరంగల్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే అవకాశం మనందరికీ లభించడం గొప్ప గౌరవంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు భావించాలన్నారు. 2019 నాటికి దేశంలోనే మోడల్ నగరంగా వరంగల్ ఆవిర్భవించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహకారం అందించాలన్నారు. శుక్రవారం జిడబ్ల్యుఎంసి కౌన్సిల్ హాల్‌లో సానిటేషన్ డ్రైవ్ (వరంగల్ క్లీన్ అండ్ గ్రీన్)పై కార్పొరేటర్లు, అధికారులకు సమన్వయ కమిటీ సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ నగరంను సుందర, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 18 (నేడు) నుంచి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. సానిటేషన్, డి-సిల్‌టేషన్, వాటర్ లీకేజీ, రోడ్డు మరమ్మతు పనులను ఈ కార్యక్రమంలో భాగంగా 58 డివిజన్‌లలో చేపడతామన్నారు. ఈ కార్యక్రమం ప్రభావంతంగా జరిగేందుకు 7 సీనియర్ అధికారులను డివిజన్లకు ప్రత్యేక అధికారులుగా, 15 మంది గెజిటెడ్ అధికారులను ఏరియా బాధ్యులుగా నియమించామన్నారు. క్షేత్రస్థాయి ప్రణాళికలను రూపొందించుకొని కార్పొరేటర్లు, అధికారులు, సానిటరీ, ఇతర ఉద్యోగులు ఈ కార్యక్రమంలో సమన్వయం, ఉత్సాహంతో పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విధుల్లో జవాబుదారీ తనం, పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, అహర్నిశలు నగర అభివృద్ధికి శ్రమిస్తున్నానని అన్నారు. ప్రతిష్టాత్మక స్మార్ట్‌సిటీ, అమృత్, హృదయ్ పథకాల్లో నగరంకు చోటు లభించేలా చూసామన్నారు. భూగర్భ మురుగు కాల్వకు నిధులు కేటాయించేలా చూసామన్నారు. జాబ్‌మేళా నిర్వహించి వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అధికారులు అంతే బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. అనంతరం కార్పొరేటర్లు తమ డివిజన్‌లోని సమస్యలను మేయర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకవచ్చారు. వాటిని దశల వారిగా పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ షాహిద్ మసూద్, ఉప కమీషనర్లు ఇంద్రసేనారెడ్డి, సురేందర్‌రావు పాల్గొన్నారు.