వరంగల్

ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించినా..ప్రాజెక్టులు కట్టి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 3: ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రైతుల ప్రయోజనం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సర్య్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్దికోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఆ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ జీవో ప్రకారం నష్టపరిహారం అందిస్తామన్నారు. అయితే, మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని రైతులు కూడా నమ్మడం లేదన్నారు. భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైకోర్టు విభజన కూడా జరగాల్సిందేనని అన్నారు. ప్రత్యేక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాల ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసమేనని ఆమె చెప్పారు. భౌగోళిక పరిస్థితులు, ప్రజల సౌకర్యార్థమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే, జనగామ జిల్లా ఏర్పాటు తమ పరిధిలో లేదని, జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ నిర్ణయం మేరకే జిల్లాల ఏర్పాటు జరుగుతుందన్నారు. ఏ ఒక్కరి స్వార్థం కోసమో జిల్లాలు ఏర్పాటు కావన్నారు. ఎనిమిదితో తేదీ నుంచి రాష్ట్రంలో ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. 40 కోట్ల మొక్కలు నాటే ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, జడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.