వరంగల్

అన్నదాతల ఆశలు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, జూలై 3: మండలంలోని రైతులకు కల్పతరువైన లక్నవరం చెరువులోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చిచేరుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల 13 అడుగుల నీటి మట్టం ఉన్న లక్నవరం చెరువు నీరు 21.5 అడుగులకు చేరింది. 25 అడుగుల నీటిమట్టానికి చేరితే ఖరీఫ్ పంటకు ఢోకా ఉండదు. అయితే, వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉందనే సమాచారంతో ఇక ఖరీఫ్ పంటకు ఇబ్బందులు లేనట్లేననే ధీమాలో సాగుకు అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నారు పోసి సాగుకు సిద్ధమైన రైతులు మరో 20 రోజులలో నాట్లు వేసేందుకు ముందుకు సాగుతున్నారు. గత వర్షాకాలంలో జూన్ 22నే లక్నవరం పూర్తి సామర్యంతో నిండిపోగా ఈ సీజన్‌లో మొన్నటి వరకూ వర్షాలే పడకపోవడం రైతులలో కాలంపై సందిగ్ధం నెలకొని ఉంది. ఈ నేపద్యంలో ఒక్కరోజులోనే కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఖరీఫ్ పంటపై రైతుల ఆశలు సజీవంగా నిలిచాయి. లక్నవరం చెరువు పూర్తి స్థాయలో నిండితే రబీ పంటకు సైతం ఢోకా ఉండదు. అయితే, వరుణుడు కరుణిస్తే చెరువు పూర్తిస్థాయిలో నిండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.