వరంగల్

మరో ఐదు రోజులు 144సెక్షన్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూలై 5: జనగామ జిల్లా కోసం చేస్తున్న ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. నిత్యం తనిఖీలు తీవ్రతరం చేస్తూ పట్టణంలోని గల్లీల్లో సైతం పోలీసులు గస్తీలు ముమ్మరం చేస్తున్నారు. గత ఐదు రోజుల కిందట జనగామలో విధ్వంస సంఘటనలు చోటుచేసుకున్నప్పటి నుంచి పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కళాశాలల వద్ద, బస్టాండ్‌లో, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తూ ప్రజల్ని గుంపులుగుంపులుగా ఉండకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. భాష్పవాయువు ప్రయోగించే వజ్ర వాహనం ద్వారా పట్టణంలో 144సెక్షన్ అమలుపై ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలో 144సెక్షన్ అమలులో ఉన్నందున విద్యార్థులు ఎలాంటి సభలు, సమావేశాలు, నినాదాలు చేయవద్దని వజ్ర వాహనంతో కళాశాలల ఎదుట ప్రచారం చేయడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
సభలు, సమావేశాలకు అనుమతి లేదు
జనగామలో 144సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని స్థానిక సి ఐ శ్రీనివాస్ తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సి ఐ శ్రీనివాస్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంత మంది ఉద్యమకారులపై కేసులు నమోదయ్యాయో వివరించారు. ఇప్పటి వరకు 48మందిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.