వరంగల్

ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కొత్తగా క్రాప్‌లోన్ ఇచ్చారా అని తెలంగాణ టిడిపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ అరికిల నర్సారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పరకాల బ్యాంక్ ఎదుట టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ గన్నోజు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరికిల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశంలు హాజరైన్నారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేయాలని, కొత్తగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్‌ల ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన పట్టించుకోవడం లేదని అన్నారు. పరిపాలనలో సరైన ఒక కార్యక్రమం తీసుకున్నారా అని ప్రశ్నించారు. 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులుగాని వారి కుటుంబాలను పరామర్శించన దాఖలాలు లేవని చెప్పారు.
* టిడిపి ఆధ్వర్యంలో రాస్తారోకో...
రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేయాలని, పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఎదుట టిడిపి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి