వరంగల్

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, జూలై 22: ఎంజి ఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, సెక్యూరిటీ గార్డులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సాటిటేషన్, సెక్యూరిటీ గార్డులు తమ విధులను బహిష్కరించి శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు.గ్రేటర్ వరంగల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ ధర్నా కార్యక్రమానికి హాజరై వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆల్ సర్వీస్ కాంట్రాక్టు యాజమాన్యం గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌లాంటి సౌకర్యాలను సరిగా ఇవ్వడం లేదని అన్నారు. కార్మికులతో పనిచేయించుకుంటూ వారికి వచ్చే జీతంలో 1000, 1500 రూపాయలను కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ సర్వీస్ యాజమాన్యపు కాంట్రాక్టును వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబర్ 14 ప్రకారం కనీస వేతనాలను ఇవ్వాలని తెలిపారు.