వరంగల్

మొక్కలే మానవ మనుగడకు ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, జూలై 22: భూమిపై మానవ మనుగడ నిలవాలంటే మొక్కల పెంపకం అవసరమని వరంగల్ పోలీసు కమీషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం హరిత హారంలో భాగంగా మడికొండ బాలికల సాంఘీక సంక్షేమ పాఠశాలలో మడికొండ పోలీసుల అధ్వర్యంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుధీర్‌బాబు ముందుగా పాఠశాల ఆవరణలో మామిడి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు రెండు వేల మొక్కలు నాటారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ కమీషనరేట్ పరిథిలో ఇప్పటివరకు ఏడు లక్షల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం హరిత హారంలో ప్రజలు ప్రత్యక్ష్యంగా భాగస్వాములు కావడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి, కాలుష్య రహిత వాతావరణాన్ని సృష్టించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఎసిపి జనార్థన్, మడికొండ ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు, కార్పోరేటర్ జోరిక రమేష్, ప్రధానోపాద్యాయురాలు విధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.