వరంగల్

పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలి, నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 22: పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుందని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. శుక్రవారం హరితహార కార్యక్రమంలో భాగంగా పరకాల శివారులోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థినీలు తలుచుకుంటే సాధించలేనిదేది లేదన్నారు. చెట్లు అంతరించి పోవడంతో వాతావరణం కాలుష్యమవుతోందన్నారు. దీని వల్ల సకాలంలో వర్షాలు కురియడం లేదన్నారు. ఖాళీ ప్రదేశాలల్లో మొక్కలు నాటితే గ్రామాలు పచ్చదనంతో నిండుకుంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ఆవి చెట్లుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీ ఇంట్లో, మీ గ్రామాల్లో చెట్ల గురించి వివరించి మొక్కలు నాటించాలని తెలిపారు.
అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన అందిరిపైనా ఉందన్నారు. చెట్లతో కలిగే అనేక ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. పోలీస్ శాఖ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి కొనసాగిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.