వరంగల్

హరితహారం నిరంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 22: హరితహార కార్యక్రమంలో మొదటి దశలో వరంగల్‌జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని రెండో దశ కార్యక్రమంలో కూడా అందరి భాగస్వామ్యంతో, చిత్తశుద్ధితో పనిచేసి రాష్ట్రంలో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహారి అన్నారు. శుక్రవారం కలెక్టరెట్‌లోని సమావేశ మందిరంలో హరితహారంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 46కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించగా జిల్లాలో 4కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. హరితహార కార్యక్రమంకు టైం,షెడ్యుల్ లేదని అన్నారు. హరితహారం నిరంతర కార్యక్రమం, లక్ష్యం సాధించే వరకు మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండుకోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు వివరించారు. వివిధ శాఖల వారిగా లక్ష్యాన్ని సాధించాలని, లక్ష్యాన్ని సాందించేందుకు మొక్కలను సమకూర్చుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి శాసనసభ్యులు తమతమ నియోజకవర్గాల్లో హరితహారంలో చురుగ్గా పాల్గొనాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి లక్ష్యం సాధించేలా చూడాలన్నారు. ముఖ్యంగా అటవిశాఖ వారు అడవులు క్షిణించిన చోట ఖాలి ప్రదేశాల్లో మొక్కలు నాటి నిర్ధేంచిన లక్ష్యాన్ని పెంచాలన్నారు. అలాగే ఎక్సైజ్, నగరపాలక సంస్థ తమ లక్ష్యాల్లో వేనుకబడి ఉన్నారని ప్రణాళికతో, సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. నగరంలో, పట్టణాల్లో, కాలనీలలో అసోసియెషన్స్, కమిటీల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమర్థవంతంగా చెపట్టి విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో బ్లాక్ ప్లాంటేషన్‌కు ప్రాధన్యత ఇవ్వాలన్నారు. వివిధ గ్రామాల్లో ఒక ఏకరంకు మించి ఉన్న ప్రభుత్వ భూములను మండల ప్రత్యేక అధికారులు, రెవిన్యూ అధికారులు గుర్తించి అటవిశాఖ అధికారుల సహాకారంతో బ్లాక్ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటి పెన్సింగ్ చేయాలన్నారు. ఈజిఎస్ ద్వారా నాటిన మొక్కలకు నీరుపోసి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మెయర్ నరేందర్, ఎమ్మెల్యేలు వినయ్‌బాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పాల్గొన్నారు.