వరంగల్

సజావుగా దేహదారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, జూలై 22: పోలీసు కానిస్టేబుళ్ల నియమకం కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం ఎనిమిదవ రోజు హన్మకొండ జెఎస్‌ఎన్ మైదానంలో, కెయు మైదానంలో కూడా సజావుగా జరిగాయి. నిన్న 800 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈరోజు ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగింది. 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్ లాంటి క్రీడలలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. రూరల్ పరిథిలో 1023 మంది అభ్యర్థులు 800 మీటర్ల పరీక్షకు హాజరయ్యారు. 210 మంది మహిళా అభ్యర్థులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి యాదయ్య, పరిపాలనా అధికారి స్వరూపారాణి, ఎసిపి శోభన్ కుమార్, జనార్థన్, తదితరులు పాల్గొన్నారు. కాగా కెయు మైదానంలో నిర్వహించిన పరీక్షలలో 1122 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 944 మంది పురుషులు, 174 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అర్హత సాధించిన వారికి అడ్మిట్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ప్రవీణ్‌కుమార్, ములుగు ఎఎస్పీ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు.