వరంగల్

గ్రీన్ సిటీగా వరంగల్*

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా హరితహార కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రారంభించిందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. రెండవ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఏర్పాటు చేసిన హరతహార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ కార్యక్రమం హరితహారమని అన్నారు. తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా కరువురావడం, రైతులు వలసవెళ్లడం, పంటలు లేక ఇబ్బందులకు గురయ్యారనే ఉద్దేశంతో ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టిందని అన్నారు. కరువును పారదోలాలంటే మొక్కలు నాటి వనాలను పంచాలని అన్నారు. ధుర్భిక్ష పరిస్ధితులను దూరం చేసేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో ఆలోచించి వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 230కోట్ల మ్కొలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. హరితహారం ఒక నిరంతర కార్యక్రమమని , లక్ష్యం సాధించే వరకు మొక్కలు నాటాలన్నారు. వనాలతోనే వర్షాలు సంవృద్దిగా కురుస్తాయని అన్నారు. వాతావరణ సమతుల్యం వల్లే వర్షాలు కొన్ని ప్రాంతాలలో కురుస్తు, మరికొన్ని ప్రాంతాలలో కురవడం లేదని అన్నారు. జీవులకు ప్రాధమిక అవసరాలైన ప్రాణవాయువునీరు, ఆహారం చెట్ల ద్వారనే అందుతాయని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు మొక్కలను విరివిగా నాటి భవిష్యత్ తరాలకు అందించీలని అన్నారు. మ్కొలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఇప్పటికే రెండుకోట్ల మొక్కలు నాటామని, మరో కోటిన్నర మొక్కలు నాటుతామని తెలిపారు. మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధిలో 15లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. హరితహార కార్యక్రమానికి తమ పాలకవర్గం, కార్పోరేషన్ ఉద్యోగులు నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ కొండ మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ఆరూరి రమేష్, ఇన్‌చార్చి కమిషనర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.