వరంగల్

గోదావరి గలగలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఆగస్టు 4: మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 6.12మీ చేరిన గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో కురుస్తున్న వర్షాలతో మండలంలోని రాంనగర్ లోలెవల్ వంతెన వద్ద జీడివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన ధ్వంసమై రాంనగర్, లంబాడితండా, కోయగూడ ఎల్లాపూర్ గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాంనగర్ లోలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.