వరంగల్

నాణ్యమైన విద్య.. ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 4: ఉత్తమ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్ నగర శివారులోని మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు పాపారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేశామని, దాని ఫలితంగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇతర శాఖలను తలదనే్న విధంగా వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని, సంస్థ ప్రమాణాలను అదే తరహాలో మెయింటేన్ చేయాలన్నారు. రానున్న మూడేళ్లలో హైస్కూల్ వరకు ఏర్పాటు చేయాలన్నారు. రాక్ మెయిల్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్‌ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని, వచ్చే విద్యాసంవత్సరానికి ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో విద్యార్థులు జీవితాన్ని ఎదుర్కొనే విధానం సులువవుతుందని తెలిపారు. ఇంజనీరింగ్‌లో పటిష్ట విద్య నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని ఎదుర్కొనే స్థాయికి విద్యార్థులను నిలబెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 340 ఇంజనీరింగ్ కళాశాలలో 2లక్షల 40వేల సీట్లు ఉండగా ఈ మేరకు ఇంజనీరింగ్ సీట్లను లక్షకే కుదించామని అన్నారు. డిగ్రీ కళాశాలలో భోగస్ అడ్మిషన్లను అరికట్టేందుకు ఆన్‌లైన్ విధానాన్ని చేపట్టామని, గతంలో 2లక్షల 60వేల అడ్మిషన్లు కాగా ఈ ఏడాది లక్ష 60వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందారన్నారు. నిరుపేద కుటుంబాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు 320 గురుకుల పాఠశాలలను మంజూరు చేసి ఈ ఏడాది ప్రారంభించుకున్నామని అన్నారు. జెడ్పిచైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తెలంగాణకు బంగారు బాటలు వేయాలన్నారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్‌కు స్మార్ట్‌సిటీ, హృదయ్‌తో దేశ వ్యాప్త గుర్తింపు వచ్చిందని, హెరిటేజ్ సిటీగా రెండోసారి స్థానం లభించిందని అన్నారు. నగరంలో పేరొందిన విద్యాసంస్థ అయిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ జిల్లాను విద్యా, ఉపాధి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం కెజి టు పిజి విద్యావిధానాన్ని అమలు పరుస్తుందని, పాఠశాలలో వౌళిక సౌకర్యాలు కల్పించేందుకు అధిక బడ్జెట్ కేటాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డి ఎం ఏ మాజీ ప్రెసిడెంట్ మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు సురేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్ పర్సన్ జగదీశ్‌రెడ్డి, సొసైటీ బాధ్యులు రఘోత్తంరెడ్డి, నోరియా, శ్యాం, రఘురాం, ఆదిత్యారెడ్డి, వరద రాజేశ్వర్‌రావు, కార్పొరేటర్ జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.