వరంగల్

ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల్లో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుూంనగర్, ఆగస్టు 4: దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద సేకరించిన భూములలో కూడా హరితహారం కింద బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని, అందుకు గాను ఆ ప్రాంతాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దేవాదుల ఎస్సారెస్పీ ఇంజనీర్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాదులకు సంబంధించి రామప్ప నుండి పులుకుర్తి, పులుకుర్తి నుండి ధర్మసాగర్, ధర్మసాగర్ నుండి గండిరామారం, ఆర్ ఎస్ ఘన్‌పూర్, గండిరామారం నుండి బొమ్మకూరు మధ్య గల దేవాదుల పైపులైన్‌ల కోసం సేకరించిన భూముల్లో పైపులైన్ల వెంబడి ప్రదేశాలను దేవాదుల డిఇ, మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు కలిసి సంయుక్తంగా తనిఖీ చేసి ఆ ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు, పెన్సింగ్ ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలన్నారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ వెంబడిగల ఖాళీ ప్రదేశాల్లో కూడా అదే విధంగా చేయాలన్నారు. ఈ ప్రదేశాలలో మామిడి చెట్లు నాటించి వాటి నిర్వాహనను స్వయంసహాయక సంఘాలకు అప్పజెప్పడం జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలకు నీటి సరఫరా లభ్యతపై కూడా తగు విచారణ జరపాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దేవాదుల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ వీరయ్య, ఎస్సారెస్పీ పర్యవేక్షక ఇంజనీర్లతో పాటు ఆయా శాఖల ఇంజనీర్లు, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.