వరంగల్

మల్లన్నసాగర్‌పై సిఎంకు వ్యామోహం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మల్లన్నసాగర్‌పై ఎందుకంత వ్యామోహమని కేంద్ర జాతీయ విపత్తుల మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్‌లో రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్టు నిర్మించలేరా? అని ఆయన ప్రశ్నించారు. రిజర్వాయర్ కోసం ప్రత్యేకంగా 123 జిఓ తీసుకవచ్చి భూసేకరణ చేయాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు చెంపపెట్టు పెట్టడం హర్షనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిర్మించేందుకు మల్లన్నసాగర్ గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసి పోలీసుల ద్వారా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 123 జిఓ కింద గ్రామస్థుల భూములను రిజిస్ట్రేషన్ చేయాలని చూడడం పట్ల హైకోర్టు జిఓ 123 రద్దు చేయడం ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ప్రాణహిత, చేవేళ్ల ద్వారా 160 టిఎంసిల నీటిని 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా స్టోరేజ్ రిజర్వాయర్‌ను కట్టిన దాఖలాలు లేవన్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతంతో సంబంధం లేదని, కాళేశ్వరం, మేడిగడ్డలో 120 రోజులకు సరిపడా నీటి లభ్యత ఉందన్నారు. వ్యవసాయ వినియోగానికి నీటి స్టోరేజీ అవసరం లేదన్నారు. గోదావరి నుండి హైదరాబాద్ వరకు 30 టిఎంసిలు, పరిశ్రమలకు 6 టిఎంసిలు, గ్రామాలకు 10 టిఎంసిల నీరు అవసరం ఉండగా వ్యవసాయానికి స్టోరేజీ అవసరం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని ప్రాజెక్టుల వద్ద రిజర్వాయర్ లేకుండానే సరాసరి నీరందిస్తామన్న కెసిఆర్ మల్లన్నసాగర్ విషయంలో ఎందుకు మంకుపట్టు పడుతున్నాడన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అనాలోచిత విధానం వల్ల రాష్ట్ర ప్రజలపై 28వేల కోట్ల భారం పడుతుందని అన్నారు. సిఎం కెసి ఆర్ తెలంగాణలో ఒక నియంతలా పరిపాలన చేస్తున్నాడని, ఇకపై ఆయన ఆటలు సాగనివ్వమని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో అవసరమనుకుంటే కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు. ప్రజలు అమాయకులుకారని, తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. జెఎసి పొలిటికల్‌చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారు కూడా మల్లన్నసాగర్‌కు వ్యతిరేకం కాదని చెప్పడం సరికాదన్నారు. ఇలాంటి విషయంలో ప్రజలు, ప్రజాసంఘాలంతా ఒకే తాటిపై ఉండి ప్రభుత్వంపై పోరాడాలని ఆయన కోరారు.