వరంగల్

సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, ఆగస్టు 4: కెసిఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఉల్లఘించే ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ శాసన సభ ఉపనేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం బాలసముద్రంలోని జిల్లాపార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైన బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్ కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు బాలరాజుతోపాటు 74 మంది, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు హన్మకొండ సాంబయ్యతోపాటు 74మంది, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆంగోతు కిషన్‌తోపాటు 57 మంది కార్యవర్గంతో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని మరచి, కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ నిరంకుశ దొరల పాలనను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని మరిచి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేశారని, జెఏసి చైర్మన్ కోదండరాంను అవమాన పరచే విధంగా వ్యవహరించడమే కాక తెలంగాణ వాదులను వేదిస్తున్నారని నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టులు ఊరుకోవని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కెసి ఆర్ సోంతరాజ్యాన్ని నడుపుతూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియంతృత్వ పాలనను, కుటుంబపాలనను అణగదొక్కేందుకు ఆయా వర్గాలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విదానాలు, ప్రజాసమస్యలపై అనుబంధ సంఘాల నాయకులు పోరాటాలు ఉదృతం చేయాలని కోరారు.