వరంగల్

ప్రభుత్వ అవినీతికి చెంపపెట్టు.. ‘మల్లన్నసాగర్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఆగస్టు 4: హైకోర్టు తీర్పును గౌరవించి జీవో నెంబర్ 123ను రద్దుచేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగు దేశం పార్టీ శాసనసభ ఉపనేత సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని, బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తెరాస ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్వర్యంలో తెదేపా శ్రేణులు పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త వాగ్దానాల వరదను గ్రాఫిక్స్‌లో చూపిస్తూ ముఖ్యమంత్రి హోదాలో రాజకీయ పబ్బం గడుపుతున్నాడే తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటి హబ్‌ల పేరుతో రైతుల నుండి బలవంత భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. 213 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వకుండా మోసపూరితంగా 123వ జీఓను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల పొట్టను కొట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దీనిని వ్యతిరేకించిన రైతులను భయపెట్టి, బెదిరించి భయాందోళనలు సృష్టిస్తూ దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. ఇందుకు మల్లన్నసాగర్ ఉదంతమే నిదర్శనమని, తమకు న్యాయం చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులను ఉసిగొలిపి లాఠీచార్జి జరిపి అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేంనరేంధర్‌రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, గట్టు ప్రసాద్‌బాబు, శ్రీనివాస్, సంతోష్‌నాయక్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.