వరంగల్

పాఠశాలల్లో మంత్రి తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఆగస్టు 5: మండలంలోని మదనపల్లి యుపిఎస్ పాఠశాలను శుక్రవారం గిరిజన సంక్షేమ, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా విధుల్లోలేని హెచ్‌ఎం భవాని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మరో ఉపాధ్యాయుడు కుమారస్వామిని సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌ను మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...గత కొంతకాలంలో మదనపల్లి యుపి ఎస్ హెచ్ ఎంగా విధులు నిర్వర్తిస్తున్న భవానికి అదే పాఠశాలలో పనిచేస్తున్న సహోపాధ్యాయుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తి పరస్పరం అధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఈమేరకు హెచ్‌ఎం భవాని జిల్లా మహిళా జడ్జి నీలిమకు ఉపాధ్యాయులపై లఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో మహిళా జడ్జి నీలమ సదరు ఉపాధ్యాయులు కోర్టులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్, ఎంఇఒ పాముల శ్రీనివాస్‌లు జోక్యం చేసుకుని హెచ్‌ఎంకు, ఉపాధ్యాయుల మధ్య సయోధ్య చేకూర్చారు. భవానిని చిన్నగుంటూరుపల్లి పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను బివిఎన్ తండాకు పంపించారు. ఈతరుణంలో హెచ్‌ఎం భవాని చిన్నగుంటూరుపల్లి పాఠశాల నుండి మదనపల్లి యుపిఎస్‌కు అనధికారికంగా విధుల్లో చేరారు. ఈనేపథ్యంలో హెచ్‌ఎం విషయమై పలువురు మంత్రి చందూలాల్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన శుక్రవారం పాఠశాలను తనిఖీ చేశారు. తనిఖీలో హెచ్‌ఎం భవాని సెలవు పత్రం లేకపోవడంతో ఇన్‌చార్జిగా ఉన్న కుమారస్వామిని మందలించారు. సెలవు పత్రం లేకుండా రిజిష్టర్‌లో సిఎల్ వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కుమారస్వామిని, సెలవుపత్రం లేకుండా గైర్హాజర్ అయిన ప్రధానోపాధ్యాయిని భవానిపై సస్పెండ్ వేటు వేయాలని అందరి సమక్షంలో మంత్రి డిఇఒకు ఫోన్ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం మంత్రి చిన్నగుంటూరుపల్లి, మాధవరావుపల్లిలోని కస్తూర్భాగాంధీ పాఠశాల ఆవరణలో, ములుగులోని ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయనవెంట ప్రజాప్రతినిధులు,అధికారులు ఉన్నారు.