వరంగల్

ప్రజల ఆశలు అడియాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి అనాలోచిత పనుల వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పోశాల పద్మ అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్న కెసిఆర్ ప్రభుత్వం, వారి ఆశలను ఆడియాశలు చేసిందని విమర్శించారు. పరిశ్రమలు, పాజెక్టుల పేరుతో పేద ప్రజల భూములను జిఒ నెంబర్ 123,124ల పేరుతో బలవంతపు భూసేరణ ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల పరిపాలనలోనే తెరాస ప్రభుత్వం ఎన్నో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ, ప్రజా పరిపాలనను గాలికి వదిలివేసిందని ఆరోపించారు. ఎంసెట్ 2 లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తున్నా, బాధ్యులపై చర్యలకు వెనుకంజ వేయడంలో ఉన్న మతలబు ఎమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందలేదని, పత్రికా ప్రకటనలకే తప్ప ప్రజా పరిపాలనలో పనులు చేస్తున్న దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరళ్ల శారద అనుమతితో 51 మందితో జిల్లా కమిటీని, 13మంది ఉపాధ్యక్షులు, 18 ప్రధాన కార్యదర్శులు, 20మంది కార్యదర్శులను, 37 మంది మండలపార్టీ అధ్యక్షరాళ్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు మద్దెల శోభారాణి, నసీం జహా, బండారు కళ్యాణి, లక్ష్మీ, పార్వతమ్మ, యాకూబీ తదితరులు పాల్గొన్నారు.