వరంగల్

మోగిన గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నగార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 5: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ (స్థాయి సంఘం) ఎన్నికకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 8న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుండి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న స్క్రూట్నీ పరిశీలన అనంతరం చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు 4 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 24న ఓటింగ్ అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. స్టాండింగ్ కమిటీ ఎన్నుకోవలసిన సభ్యుల సంఖ్య ఆరుగురు మాత్రమే. ఎన్నిక కాబడిన సభ్యుల కాలపరిమితి ఎన్నిక కాబడిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు మాత్రమే ఉంటుంది. స్థాయి సంఘ సభ్యులను ఎన్నిక కాబడిన గ్రేటర్ పరిధిలో ఉన్న 58 మంది కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. ఆరుగురు సభ్యులకన్నా తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్నిక నిర్వహిస్తారు. ఆరుగురు సభ్యులకై నామినేషన్లు ఆరు మాత్రమే అందినట్లయితే ఆరుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిషనర్ ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తరువాత ఈ ప్రకటన ఉంటుంది. ప్రతి కార్పొరేటర్ పోటీ చేసే అభ్యర్థుల నుండి ఆరుగురు సభ్యులను మాత్రమే తమకు జారీ చేయు బ్యాలెట్ పేపర్ నందు ఇన్‌టు మార్క్ గుర్తు ద్వారా ఎన్నుకోవలసి ఉంటుంది. పోటీ చేయు అభ్యర్థులలో ఏదేని ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినట్లయితే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత కమిషనర్ ఎన్నికల ఫలితాలు ప్రకటించి సభ్యులు ఎన్నికైనట్లు అధికారిక పత్రాన్ని అందజేస్తారు.