వరంగల్

కెసిఆర్‌ది కుటుంబ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, ఆగస్టు 5: తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబపాలనకు పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు దుయ్యబట్టారు. మండల కేంద్రంలో శుక్రవారం ములుగునియోజకవర్గస్ధాయి తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియెజక ఇంచార్చ్ సీతక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో గండ్ర సత్యనారాయణరావుతోపాటు రాష్ట్ర నాయకులు ఈగ మల్లేశం, గట్టు ప్రసాద్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలంగాణా ప్రజలకు కెసిఆర్‌కు అధికారం కట్టబెట్టితే ప్రజల ఆశలను తుంగలో తొక్కిన పాలకులు కుటుంబానికి మేలు జరిగేలా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో విడిపోతే నేడు లక్షల కోట్ల అప్పులు చేసిన పాలకులు కనీసం రైతుల బుణమాఫీ అమలను కూడా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. విడతల వారీగా బుణాలను మాఫీచేయడం వల్ల అన్నదాతలు తీసుకున్న అప్పులు బ్యాంకుల వడ్డీలకే సరిపోతుందని వారు అన్నారు. బుణమాఫీ కాక చేసిన అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించి, పరిహారం అందించాల్సిన పాలకులు ఏ ఓక్కరూ రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని వారు గుర్తుచేశారు. రైతుల కోసం తమ పార్టీ ఓక్కక్కరికి 50వేల పరిహారం అందించి రైతులకు ఉడతాభక్తి చూపితే, పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహారించారని అన్నారు. మిషన్‌కాకతీయలో ఇప్పటి వరకూ కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, తాము నిరూపిస్తామని బహిరంగ సవాల్ విసిరారు.