వరంగల్

గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఆగస్టు 5: ఏజన్సీ ప్రాంతాలలోని ప్రజలు ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపాలంటే నిషేధిత మత్తు పదార్ధాలపై (గుట్కా, అంబర్) పోలీసులు దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ఏజన్సీ ప్రాంత ప్రజలను పట్టి పీడించిన గుడుంబాను నిర్మూలించడంలో అధికారులు చూపించిన చొరవ, నిషేధిత మత్తుపదార్ధాలైన గుట్కా, అంబర్‌వంటి వాటిని నిర్మూలించేందుకు పోలీసు అధికారులు చొరవచూపి అమ్మకాలను పూర్తిగా అరికట్టేందుకు కృషిచేయాలన్నారు. గుట్కాలతో టిబి వ్యాధి వస్తుందని ఇటీవల ఏజన్సీ ప్రాంతాలలో చేపట్టిన వైద్య పరీక్షలలో తేలిందని వైద్యులు కలెక్టర్‌కు విన్నవించడంతో, గుట్కా అమ్మకాలపై అధికారులు దృష్టిసారించాలన్నారు. అనంతరం ఏటూరునాగారం క్లస్టర్‌లోని అంగన్‌వాడి అధికారులు, సూపర్‌వైజర్‌లను అంగన్‌వాడి పనితీరుపై ప్రశ్నిచారు.