వరంగల్

జిల్లాకు 4 లక్షల టేకు వేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఆగస్టు 5: జిల్లాకు 4 లక్షల టేకు వేర్లు కేటాయించగా అందులో 80 వేల టేకు వేర్లు పరకాల డివిజన్‌లోని నాలుగు మండలాలకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ సంచాలకురాలు ఉష తెలిపారు. శుక్రవారం పరకాల మండలం చర్లపల్లి, రాయపర్తి, నర్సక్కపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా జెడిఏ ఉష, పరకాల జడ్పిటిసి పాడి కల్పనాదేవిలు టేకు వేర్లు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు టేకు వేర్లు పంట పొలాల్లో, గట్ల వెంబడి నాటుకోవాలన్నారు. టేకు వేర్లు రవాణాకు అనుకూలంగా ఉంటాయని వీటి ద్వారా వచ్చే మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఇంచార్జ్ ఎడిఏ నాగరాజు, ఏఇఓ అనిల్‌కుమార్, రైతులు రమణారెడ్డి, పాడి ప్రతాప్‌రెడ్డి, సాంబరెడ్డి, చల్లా భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.