వరంగల్

మానవ మనుగడకు మొక్కలే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక డివిజన్‌లలో ఆయన హరితహార కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్‌తో పాటు ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్‌మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌ను హరితనందనంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజు నగరంలో 2.5లక్షల మొక్కలు నాటామని ఆయన తెలిపారు. హరితహార కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. మొక్కలు మానవ మనుగడకు ప్రధానమని, భావితరాలకు ఆదర్శంగా నిలిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.