వరంగల్

అంత్య పుష్కరాలకు పెరుగుతున్న రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఆగస్టు 5: మంగపేట పుష్కరఘాట్ వద్ద అంత్య పుష్కరాలలో ఆరవ రోజు శుక్రవారం భక్తులు పెరిగారు. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజు ఆదివారం నుండి గురువారం వరకు అంతంత మాత్రమే విచ్చేసిన భక్తులు శుక్రవారం మాత్రం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన వందలాది మంది శుక్రవారం మంగపేట పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనేక మంది తమ పితృ దేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో శుక్రవారం మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి తీరం సందడిగా మారింది. అంత్య పష్కరాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం గోదావరి నదీమతల్లికి అర్చకులు వేదమంత్రాలతో అఖండ హారతి ఇచ్చారు. దీంతో పలు పుష్కరఘాట్ల వద్ద భక్తుల రదీద పెరిగింది. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.