వరంగల్

ఆలయాలకు శ్రావణ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్చరల్ (వరంగల్), ఆగస్టు 5: వరంగల్ మహా నగరంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆలయాలన్ని శుక్రవార శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసంలోమొదటి శుక్రవారం కావడంతో వేలాదిగా మహిళలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలను జరుపుకున్నారు. నగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని అమ్మవారి దేవాలయాలలో భక్తులు ప్రత్యేక కుంకుమార్చనలు చేసారు. కాగా నగరంలోని ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయ క్షేత్రంలో వందలాదిగా భక్తులు బారులుదీరి మాతను దర్శించుకున్నారు. శుక్రవారం సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నిత్య పూజలను జరిపిన అనంతరం భద్రకాళి మాత దర్శనానికై భక్తులను అనుమతించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ముతైదువులకు వాయనాలను సమర్పించుకున్నారు. ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో కట్టా అంజనీదేవి ప్రత్యేక ఏర్పాట్లను చేసారు. వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ పుట్టిన రోజు సందర్భంగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను చేసారు. ఆయనతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కూడా అలయంలో జరిగిన పూజలలో పాల్గొన్నారు.
పూజానంతరం మేయర్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి వస్త్రంతో సత్కరించారు. వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలను చేసారు. ఆలయ అర్చకులు యల్లంభట్ల లక్ష్మణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వేలాదిగా ముతైదువులు వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయం అంతా లక్ష్మీమాత నామస్మరణతో మారుమ్రోగింది. ముందుగా రాజరాజేశ్వరీ అమ్మవారికి అర్చకులు శ్రీచక్రార్చన లలితా పారాయణం జరిపి పూజాకార్యక్రమాలను నిర్వహించారు. పూజానంతరం భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.