వరంగల్

ప్రతి మొక్కను సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఆగస్టు 5: కలెక్టర్ వాకాటి కరుణ ఏటూరునాగారం మండలం ఏజన్సీ గ్రామాలలో పర్యటించారు. గురువారం రాత్రి ఐటిడిఎ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష అనంతరం రాత్రి ఏజన్సీలోనే బసచేశారు. శుక్రవారం ఉదయం మండలంలోని చల్పాక, బన్నాజిబంధం గ్రామాలను సందర్శించి, ఇటీవల నూతనంగాచేపట్టిన బిటి రోడ్ల నాణ్యతలను పరిశీలించారు. బన్నాజిబంధం గ్రామస్ధులతో మాట్లాడుతూ అడవులను నరికి పోడు చేయవద్దని, చెట్లను నాటాలని హితవు పలికారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్‌లను అందింస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని రొయ్యూరు గ్రామశివారులతోపాటు, మండల కేంద్రంలోని ఐటిడిఎ ఉద్యానవన నర్సరీ, కొమురంభీం మినీ స్టేడియం, ఐటిడిఎ క్వార్టర్స్ వద్ద మొక్కలను నాటారు. ముందుగా విద్యార్ధులతో ర్యాలీగా విచ్చేసిన కలెక్టర్ కొమురంభీవ మిని స్టేడియంలో విద్యార్ధులతో మొక్కలు నాటించగా, ఫారెస్ట్ ఛీఫ్ కన్జర్వేటర్ ఎండి.జమాలుద్దీన్ అక్బర్ మొక్కల ఆవశ్యకత, వాటి ఉపయోగాలను అధికారులు, విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ములుగు ఆర్డీఒ మహేందర్‌జీ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ధులచే హరితహారం కార్యక్రమంలో నాటిని మొక్కలను సంరక్షించి, తెలంగాణాకు హరితహారం నెరవేర్చేలా ప్రతిజ చేయించారు. అనంతరం కలెక్టర్ కరుణ విలేఖరులతో మాట్లాడుతూ...హరితహారం రెండవ విడత కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతోందని, నాటిని ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.