వరంగల్

శాయంపేట హవేలిలో వరంగల్ జిల్లా కేంద్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూనే మరోవైపు జిల్లా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు. కొత్తగా ప్రతిపాదించిన హన్మకొండ జిల్లా కేంద్రాన్ని ఇప్పటి వరకు వరంగల్ జిల్లాగా కొనసాగుతున్న కార్యాలయాల్లోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటూ వరంగల్ జిల్లా కేంద్రాన్ని నగరానికి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న శాయంపేట హవేలిలో నూతన భవనాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శాయంపేట హవేలి- రాయనిగుంటూరుపల్లి-చింతలపల్లి మధ్య ఉన్న దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు.
గతంలో ఇదే స్థలాన్ని టెక్స్‌టైల్ పార్కు కోసం సర్వే చేశారు. అయితే టెక్స్‌టైల్ పార్కును ధర్మసాగర్ మండలంలోని దేవునూరుగుట్టల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రతిపాదించినందున శాయంపేట హవేలిలోనే వరంగల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ భూమి సరిపోనట్లైతే మరో వెయ్యి ఎకరాలు ప్రయివేట్ భూమిని కూడా కొనుగోలు చేసి అన్ని కార్యాలయాలు ఒకే వద్ద ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు గత రెండు రోజులుగా అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. ఈ విషయం కాస్త బయటికి తెలియడంతో ఆ సమీప ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పుడే రియల్టర్లు కూడా రంగ ప్రవేశం చేసినట్లు తెలిసింది.