వరంగల్

వరంగల్‌ను విడదీస్తే చరిత్రహీనులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు28: హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం హన్మకొండలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదనలో హన్మకొండ జిల్లా ప్రతిపాదన ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజల నుండి ఎలాంటి డిమాండ్ లేకుండానే ముఖ్యమంత్రి కెసిఆర్ హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తేవడంలో ఉద్ధేశమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ నాయకుల ప్రయోజనాలకోసమే హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. జిల్లాల ఏర్పాటు శాస్ర్తియంగా ఉండాలే తప్పా, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదని అన్నారు. అయితే పరిపాలన సౌలబ్యంకోసం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అఖిల పక్షం అధ్వర్యంలో ఆందోళనలకు శ్రీకారం చుట్టగానే , ప్రజల నుండి వ్యతిరేకత ఉందని గ్రహించిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలోనే ఐఖ్యతలేదన్నారు. ఒక ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై సంబరాలు చేసుకుంటే మరి కొందరు ఎమ్మెల్యేలు హన్మకొండ జిల్లా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, ప్రజల అభిప్రాయాలను సిఎం కెసిఆర్‌కు తెలిపి హన్మకొండ జిల్లా ప్రతిపాదన వెనక్కుతీసుకునే విదంగా ప్రయత్నం చేస్తామని చెప్పడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.
హన్మకొండ జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈనెల 30న ఇచ్చిన వరంగల్ జిల్లా బంద్ విజయవంతం చేయాలని స్వర్ణ కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ నగరాన్ని ఎందుకు విడదీయాలని అనుకుంటున్నాడో, అసలు ఆయన ఉద్దేశమేమిటో చెప్పాలన్నారు. కెసిఆర్ సిఎం అయిన తరువాత మూడు సార్లు వరంగల్‌కు వచ్చిన నాలుగు నిద్రలు చేసి పేదలకు నాలుగువేల ఇండ్లు నిర్మిస్తామని హామి ఇచ్చిన ఇప్పటి వరకు ఇచ్చిన ఏఒక్క హామి కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. తక్షణమే హన్మకొండ జిల్లా ప్రతిపాదన విరమించుకోవాలని ఈసందర్భంగా ఆమె డిమాండ్ చేసారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ్ధర్, మాజీ కార్పోరేటర్లు గొట్టిముక్కల రమణారెడ్డి, సుంచు అశోక్ తదితరులు పాల్గొన్నారు.