వరంగల్

మళ్లీ రియల్ బూమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేయనున్న కొత్త జిల్లాల ఏర్పాటు రియలెస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది. దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండటంతో ఆయా జిల్లాలో రియలెస్టేట్ రంగం మరింత ఊపందుకుంటోంది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న మహాబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భూముల ప్రభావం ఎక్కువగాఉంది. ఈ రెండు జిల్లాల పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గత రెండు నెలల కాలంగా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక్కో ఎకరానికి కోటిన్నరకుపై ధర పలకడంతో రైతులు కూడా వ్యవసాయ పనులు మానేసి సాగు భూములు అమ్మకానికి పెడుతున్నారు. వర్షాభావ పరిస్ధితులు, అందుకు కరువుకూడా తోడు కావడంతో అన్నదాతలు వ్యవసాయం చేయలేక భూముల అమ్మకానికే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం జాతీయరహదారుల అభివృద్దికి పెద్ద పీట వేయడంతో హైవే ఠోడ్డు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న భూములకు యమ డిమాండ్ పెరిగింది. ఒకవైపు కొత్త జిల్లాల ఏర్పాటు మరోవైపు జాతీయరహదారుల నిర్మాణాలతో గత కొంత కాలంగా రియలెస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. మొన్నటి వరకు భూములకు ధరలు లేక పడాకుపడి ఉన్న భూములు నేడు పదిరెట్లు పెరిగిపోయాయి.
వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుతో ఇక్కడ పెద్దగా భూముల ప్రభావం పెద్దగా లేకపోయినా కొత్తగా ఏర్పడనున్న మహాబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భూముల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎకరాకి పట్టుమని పదిలక్షలు కూడ ధరపలకని భూములు నేడు కోటిన్నర పైగా ధర పలుకుతున్నాయి. ఇక్కడ పరిస్ధితి ఇలా ఉంటే జనగామ ప్రాంతంలో మరోలా ఉంది. జిల్లాలో ఏర్పాటు పక్రియ తెరపైకి రావడంతో వరంగల్‌లో ముందుగా జనగామ జిల్లా ఖాయమని అనుకొని రియలెస్టేట్ వ్యాపారులు ముందస్తుగానే భూములు కొనిపెట్టుకున్నారు. వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. సిఎం కెసిఆర్ జనగామ జిల్లా ప్రతిపాదన బ్రేక్ వేయడంతో ముందుగానే భూములు కొనిపెట్టుకున్న వ్యాపారులు ఇప్పుడు లబోదిబో ఉంటున్నారు. చివరివరకైనా జనగామ జిల్లా కాక పోతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నుండి భూముల ధరలు పడిపోయాయనే అపవాదం ఉండగా జిల్లాల ఏర్పాటు పుణ్యమా అంటూ జిల్లా ప్రతిపాదిత ప్రాంతాల్లో భూముల ధరలు మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరిగిపోయాయ కాగా, జిల్లాలు ఏర్పాటు అవుతున్నందున ముందు భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా భూముల అమ్మకాలు నిలిపివేసారు.