వరంగల్

గోదావరి జలాలతోనే గ్రామాలు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, ఆగస్టు 28: గోదావరి జలాలతోనే నియోజకవర్గంలోని గ్రామాలు సస్యశ్యామలంగా మారుతాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పధకంలో ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాలను తూం ద్వారా పంట పొలాలకు ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 1.58 టిఎంసి సామర్ధ్యం గల ఘన్‌పూర్ రిజర్వాయర్ నుండి దిగువనున్న 700 ఎకరాలకు సాగునీరు అందివ్వడం జరుగుతుందన్నారు. రిజర్వాయర్ నుండి రెండు పంటలకు సాగునీరు ఖచ్చితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన అన్నారు. అలాగే ఘన్‌పూర్ రిజర్వాయర్ నుండి అశ్వరావుపల్లి, నెల్లుట్ల రిజార్వయర్లకు, జఫర్‌గడ్, పాలకుర్తి మండలాలకు వరద కాల్వల ద్వారా సాగునీరు అందివ్వనున్నట్లు ఆయన అన్నారు. అంతేకాక చెరువుల పునరుద్ధరనతోనే గ్రామాలు సస్యశ్యామలంగా మారుతాయనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టిందన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువులను గోదావరి జలాలతో నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హారీష్‌రావు ఆయా పైపులైన్‌కు అక్కడక్కడా గేట్‌వాల్వులు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా బిగించిన వాల్వులతో వచ్చే గోదావరి నీటితో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నింపడం జరుగుతుందన్నారు.