వరంగల్

మొక్కల పెంపకంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుూంనగర్, ఆగస్టు 28: విద్యార్ధులకు పాఠశాల స్థాయి నుండి మొక్కల పెంపకంపై ఆసక్తి కల్పించాల్సిన అవసరం ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు సూచించారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలపై వరల్డ్ పిస్ ఫెస్టివల్ సోసైటీ సభ్యులు ఆదివారం పోలీసు కమిషనర్‌ను క్యాంపుకార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏర్పాటయిన అనంతరం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో నగర ప్రజలకు పోలీసులు మరింత చేరువకావడంతో పాటు హెల్మెట్ల వినియోగంపై కమీషనరేట్ పోలీస్ విభాగం నగరంలో గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా కమీషనరేట్ పోలీస్ విభాగం చేపట్టిన బైక్ ర్యాలీతో పాటు కమిషనరేట్ పరిధిలో పదిలక్షల మొక్కల నాటడంపై స్పందించిన వరల్డ్ పిస్ ఫెస్టివల్ సోసైటీ సభ్యులు డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యతన సోసైటీ సభ్యులు పోలీసులు అభినందనలు తెలియజేయడం సోసైటీ చెపడుతున్నా సేవా కార్యక్రమాలపై డాక్టర్ అంపశయ్య నవీన్ పోలీస్ కమీషనర్‌కు వివరించారు. అనంతరం నగరంలో మొక్కల పెంపకాన్ని మరింత ప్రోత్సహించాలనే ఆలోచనతో ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు సందర్శించే ప్రముఖులకు పండ్ల మొక్కలను జ్ఞాపికగా అందించాలనే సంప్రదాయాన్ని ప్రారంభంగా పోలీస్ కమిషనర్ తొలి మామిడి మొక్కను డాక్టర్ అంపశయ్య నవీన్‌కు అందజేయడంతో పాటు మిగిలిన సోసైటీ సభ్యులకు కూడా కమీషనర్ పండ్ల మొక్కలను అందజేసారు. పోలీస్ కమీషనర్ జి. సుధీర్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శుభకార్యాలకు బహుమతుల స్థానంలో పండ్ల మొక్కలను అందజేసే సంప్రదాయాన్ని కొనసాగించడం ద్వారా పరోక్షంగా మొక్కలను పెంపకాన్ని ప్రొత్సహించినట్లు అవుతుందని సోసైటీ సభ్యులకు సూచించారు. కమీషనర్‌కు అభినందనలు తెలియజేసిన వారిలో సంస్థ వ్యవస్థాపకులు మహమ్మద్ సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనీస్ సిద్ధీఖీ, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నర్సింహమూర్తి, కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ సురేష్ లాల్, సంతోష్, గిరజామనోహర్ బాబు, ఎస్‌విఎన్ చారి పాల్గొన్నారు.