వరంగల్

కెయులో సమస్యలపై విసి కార్యాలయం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, సెప్టెంబర్ 19: కాకతీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమైనారని, తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు విసి కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా కెయులో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటి నివారణకు అధికారులు ఏ మాత్రం చొరవ చూపకపోవడం సిగ్గుచేటని అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యావాతావణం పూర్తిగా దెబ్బతిన్నదని, అధికారులు కుర్చీలకే పరిమితం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్ల నిర్వహణ అత్యంత దయనీయస్థితిలో ఉన్నదని, గతంలో హాస్టళ్లలో విద్యార్థులు జారి పడి మృతి చెందిన సందర్బాలు ఉన్నా, అదికారులు హాస్టళ్లనిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని వాపోయారు. పేద, మద్యతరగతి విద్యార్థులు అప్పులు చేసి వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారని, తక్షణమే గ్రూప్ పరీక్షల కేంద్రాలను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల నెరవేర్చాలని విద్యార్థులు విసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కెయు విసి ప్రొఫెసర్ సాయన్నకు అందజేశారు. అనంతరం విద్యార్థులు విసికి తమ సమస్యలు విన్నవించామని త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.