వరంగల్

జోరు వానతో ఉప్పొంగిన వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి, సెప్టెంబర్ 21: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పాలకుర్తిలోని వాగులు.. వంకలు పొంగిపొర్లాయి. పాలకుర్తి నుంచి ఘనపూర్‌కు వెళ్లే రహదారిలో రాఘవపురం స్టేజి వద్ద 5్ఫట్లకు పైగా నీళ్లు వెళ్తుండటంతో ఉదయం 10గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు, ప్రయివేట్ వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. వల్మిడిలోని ఎర్రచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గమనించని ముగ్గురు రైతులు వాగు దాటుతుండగా అందులో కొట్టుకుపోయారు. చెట్టు ఎక్కి నిల్చోని బాగా ఆర్థనాదాలు చేస్తుండటంతో గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారిని బయటికి తీయడానికి పోలీసు సిబ్బంది జనగామ నుంచి ఫైర్ ఇంజన్ రప్పించినా సహాయ చర్యలకు అనుకూలంగా లేకపోవడంతో వెనకకు తగ్గారు. దీంతో పోలీసులు గ్రామస్థుల సహకారంతో తాళ్లతో ముగ్గురు రైతులను ఒడ్డుకు చేర్చడంతో బాధిత కుటుంబాలు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. విస్నూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో వరద ఉద్ధృతికి కాలనీ మొత్తం నీరు చేరడంతో మధ్య రాత్రి 12గంటలకు ఎస్సై వెంకటేశ్వర్లు ప్రొక్లెయినర్‌తో కాలనీకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.