వరంగల్

వరద హెచ్చరికలతో యంత్రాంగం అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 26: ఎగువప్రాంతం విదర్భ, మధ్యప్రదేశ్‌లలో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరిలో భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రభుత్వ హెచ్చరికల మేరకు జిల్లాయంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముందుజాగ్రత్తలు ప్రారంభించింది. గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ వాకాటి కరుణ ఆదివారం రాత్రి ఏటూరునాగారం చేరుకుని వరదలతో ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కునేందుకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు కూడా ఏటూరునాగారంలో క్యాంపు వేసి వరదసహాయక చర్యలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీర గ్రామాలను కలెక్టర్ సోమవారం సందర్శించి వరద ఉధృతి పెరిగితే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అదే విధంగా గోదావరి ఆనుకుని ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలను ముందుజాగ్రత్తగా ఎగువ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పునరావాస శిభిరాలకు తరలాలలని సూచించారు. ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి పెద్దగా లేకపోయినా సోమవారం రాత్రికి వరద తీవ్రత పెరగవచ్చని జిల్లా యంత్రాంగం అనుమానిస్తూ ఈ మేరకు ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఏటూరునాగారం మండల కేంద్రానికి వెళ్లి కలెక్టర్ కరుణ, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, ములుగు ఆర్డీఓ తదితర అధికారులతో కలసి గోదావరిలో వరదనీటి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సహాయక చర్యల ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద తీవ్రత ముంపుగ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, బాధితులకు అవసరమైన ఆహారం, మందులు తదితర ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా జిల్లాలో సోమవారం ఉదయానికి 18.6సెంటీమీటర్ల వర్షం కురిసింది. 11మండలాల్లో సెంటీమీటరు వరకు వర్షం నమోదవగా, 29మండలాల్లో ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. 10మండలాల్లో అత్యధికంగా మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదయింది. గడచిన నాలుగు, ఐదురోజులతో పోలిస్తే వర్షం తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికే కురిసిన వర్షాలతో వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని పలు మండల కేంద్రాలు జలమయంగా మారిన నేపథ్యంలో తాజాగా కురస్తున్న వర్షాలతో మరింతగా ఇబ్బందులు పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో తేలికపాటి వర్షం మొదలయింది.