వరంగల్

వరదలతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, సెప్టెంబర్ 26: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఎగువున కురిసిన వర్షాలకు ఆయా ప్రాజెక్టులనుండి నీటిని విడుదల చేయడంతో గోదావరి ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, వైద్య, పౌర సరఫరాలశాఖ అధికారులతో ఐటిడిఎ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ప్రైమరీ హెల్ల్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు సూచించారు. అన్ని గ్రామాలలో డిఆర్‌సేల్స్ డిపోలలో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచి ప్రజలకు అందించాలన్నారు. ముఖ్యంగా ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట మండలాలలో ఎప్పటికప్పుడు పరిస్ధితులను పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇసుక లారీలను పూర్తిగా నిషేధించి తుపాకులగూడెం రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ కరుణ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని అన్ని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామ పెద్దలు కాకులమర్రి చక్రధరరావు, నూతి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ కరకట్ట షెట్టర్ల లీకేజీతో గ్రామంలోకి నీరు చేరే అవకాశం ఉందని షెట్టర్లను మరమతులు చేయించాలని, ముంపు ప్రాంతాలైన ఓడగూడెం, హరిజనవాడ, మానసపల్లి ప్రజలకు పునరావాసం కల్పించి, ఇళ్లు నిర్మించాలని డిప్యూటీ సిఎంను కోరారు. అకినేపల్లి మల్లారం మాజీ సర్పంచ్ శ్రీ్ధరవర్మ దోమల మందు పిచికారి చేయించాలని, మంగపేట పుష్కరఘాట్ కోతకు గురవుతోందని, నాళాలు లేక సుమారు 70 ఎకరాల మిర్చి తోటలు నీట మునిగి పోతున్నాయని మరమత్తులు చేపట్టాలని విన్నవించారు. ప్రతి పిహెచ్‌సిలో వైద్యులు విధులకు హాజరు కావాలని, మారుమూల ప్రాంతాల రోడ్లు, ప్రధాన రహదారులకు మరమతులు చేపట్టి, ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతిని పరీశీలించారు. ఆయన వెంట కలెక్టర్ కరుణ, ఐటిడిఎ పిఒ అమొయ్‌కుమార్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, ఎఎస్పీ విశ్వజిత్, ఆర్డీఒ మహేందర్‌జీ, ఇంజనీరింగ్, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులున్నారు.