వరంగల్

లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, సెప్టెంబర్ 26: మండల కేంద్రమైన మంగపేట సమీపంలోని పొద్మూర్ కాలనీలో లోతట్టు ప్రాంతానికి చెందిన పలు కుటుంబాలను మంగపేట రెవెన్యూ అధికారులు మంగపేట హైస్కూల్‌లోని పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి నదికి ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహంతో పొద్మూర్‌లో లోతట్టు ప్రాంతంలోని పలు ఇళ్ళకు ప్రమాదం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మంగపేట తహశీల్దార్ తిప్పర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంకు తరలించి వారికి ఆదివారం రాత్రి నుండి భోజన సౌకర్యం కల్పించారు.
మంగపేట హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఐటిడిఏ పిఓ అమయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ సిహెచ్.మహేందర్‌జీ తదితరులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా పొద్మూర్ కాలనీ వాసులు గోదావరి వరదల వలన తాము పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. రెవెన్యూ సిబ్బంది పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.