వరంగల్

గోదావరి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం గోదావరి ఉద్ధృతి మరింత పెరిగింది. మండలంలోని పొద్మూరు కాలనీ, బోరు నర్సాపురం, అకినేపల్లి మల్లారం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీలోని పలు ప్రాంతాలతో పాటు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయింది. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరిలో నీరు ఉరకలెత్తుతోంది. బిల్ట్ ఇంటెక్వెల్ వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. బిల్ట్ ఇంటెక్వెల్ వద్ద సోమవారం సాయంత్రంకు మీన్ సీ లెవెల్ (గోదావరి నీటి మట్టం) 81.5 అడుగులకు చేరింది. మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి నిండు కుండలా ప్రవహిస్తుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగపేట పుష్కరఘాట్ వద్ద అనేక ఎకరాలలో మిరప తోటలు నీటమునిగాయి.
ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్
గోదావరి ఉద్ధృతి పెరుగుతుండడంతో మంగపేట పుష్కరఘాట్ ప్రాంతాన్ని సోమవారం కలెక్టర్ వాకాటి కరుణ, ఐటిడిఏ పిఓ అమేయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, మంగపేట తహశీల్దార్ తిప్పర్తి శ్రీనివాసరావు తదితర అధికారులతోకలిసి పరిశీలించారు.
గోదావరి మరింత పెరిగే అవకాశం ఉండడంతో స్థానిక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్థానిక అధికారులకు సూచించారు. పుష్కరఘాట్ పరిశీలన అనంతరం మంగపేట హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వాకాటి కరుణ వరద భాదితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ అమయ్‌కుమార్, ములుగు ఆర్టీఓ చీమలపాటి మహేందర్‌జీ, మంగపేట తహశీల్దార్ తిప్పర్తి శ్రీనివాసరావు, ఎంపిడిఓ వి.సురేష్, ఆర్‌ఐ పి.అశోక్ రెడ్డి, మంగపేట గ్రామ పంచాయితీ కార్యదర్శి కె.చిరంజీవి తదితరులు ఉన్నారు.