వరంగల్

వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 26: భారీ వర్షాల నుండి వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. గత వారం రోజులుగా వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో నష్టం అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాలను ఇక్కడికి పంపించింది. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంటు ప్రత్యేక అధికారి అరవింద్‌కుమార్, గ్రేటర్ వరంగల్ కమీషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో పాటు స్ధానిక అన్ని శాఖల అధికారులు నగరంలోని అమరావతినగర్, సమ్మయ్యనగర్, టివి టవర్ తదితరల కాలనీలలో పర్యటించారు. వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనావేసారు. దాదాపు గ్రేటర్ పరిధిలోనే 35.19కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేసారు. గ్రామీణ , ఎజెన్సీ ప్రాంతాలలోకూకుండా ఈసారి వరుణుడు పట్టణ ప్రాంతాలలోనే కనె్నర్ర చేయడంతో లోతట్టుప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పటికీ కొన్ని కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ఉద్ధృతమైన వరదతాకిడికి 100్ఫట్ల రోడ్డు పూర్తిగా దిబ్బతినడంతో పలుకాలనీల రాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. ఒకవైపు అధికారులు ముమ్మరంగా సహాయకచర్యలు చేపట్టారు. మరో రెండు రోజులపాటు కూడా భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీచేసారు.