వరంగల్

అంకితభావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, అక్టోబర్ 17: అధికారులు అంకితభావంతో పనిచేయాలని అప్పుడే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి పధంలో ముందుకు దుసుకువెళ్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశపు హాల్లో సోమవారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలో 16మండలాలే ఉన్నందున పనిభారం తక్కువగా ఉంటుందని, ప్రజల సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని అన్నారు. త్వరలో ప్రతీ మండలంలో పర్యటిస్తామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన వినతులను ప్రతీ శాఖ అధికారులు ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.