వరంగల్

ప్రజారోగ్యంపై జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 26: కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు అందించి వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సిహెచ్‌సి, సూపరింటెండెంట్‌లు, గైనకాలజిస్టులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ సమీక్షల ద్వారా సిహెచ్‌సి పనితీరు మెరుగైందని, మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించి దేశంలోనే గుర్తింపు వచ్చే విధంగా సిహెచ్‌సిలు కృషి చేయాలన్నారు. దాదాపు అన్ని సిహెచ్‌సిలలో వౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. ఆస్పత్రులకు లెబర్ టేబుల్స్ కొనుగోలు చేశామన్నారు. డోర్ కర్టెన్స్, బెడ్‌షీట్స్ అందుబాటులో ఉన్న నిధులతో కొనుగోలు చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీని పెంపొందించాలన్నారు. జిల్లాలోని 8 సిహెచ్‌సిలు, 2 ఏరియా ఆస్పత్రుల్లో 6 హెల్త్‌సెంటర్లు నిర్ణీత లక్ష్యాలను చేరుకున్నాయని తెలిపారు. చేర్యాల, పరకాల, చిట్యాల, గూడూరు హెల్త్‌సెంటర్ల పనితీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. చేర్యాల ఆస్పత్రిని నాలుగుసార్లు సందర్శించారని, సిబ్బంది, ఆస్పత్రి బాధ్యులు ఎవరు అందుబాటులో లేరని, వైద్యాధికారుల పనితీరు సరిగ్గా లేనందున అట్టి ఆస్పత్రి సూపరింటెండెంట్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని, అదే విధంగా పరకాల సిహెచ్‌సి గైనకాలజిస్టు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నందున వెంటనే బదిలీ చేయాలని డిసి హెచ్‌ను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రభుత్వ విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మానవత్వంతో వైద్య సేవలు అందించాలన్నారు. జనగామ, నర్సంపేట, ములుగు ఆస్పత్రులకు స్కానింగ్ మిషన్‌లను కొనుగోలు చేస్తామని, ఆస్పత్రుల నిర్వాహణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పరకాల ఆస్పత్రి భవనం కూలిపోయే దశలో ఉన్నందున నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా నర్సంపేటలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వేసవిని పరిగణలోకి తీసుకొని కమ్యూనిటీ సెంటర్లకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు గాను డ్రగ్స్ ఆవశ్యకతపై నివేదిక అందజేయాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో ఏసిలు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిసిహెచ్ ఎస్ సంజీవయ్య, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల సూపరిండెంట్‌లు, గైనకాలజిస్టులు పాల్గొన్నారు.