వరంగల్

బహిరంగ మలవిసర్జన రహిత మండలంగా ‘రఘునాథపల్లి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, అక్టోబర్ 20: రఘునాథపల్లి మండలాన్ని బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దాలని జనగామ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపిపి దాసరి అనిత అధ్యక్షతన మరుగుదొడ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని దాసన్నగూడెం గ్రామంలో నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్ బైరగోని బాబును సన్మానించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోన్నా ఇంట్లో ఆడవారికి ఓ మరుగుదొడ్డి నిర్మించలేని స్థితిలో ఉన్నారన్నారు. రూ. 20వేలు వెచ్చించి స్మార్ట్ఫోన్ కొనాలంటే నిముషాల్లో కొంటున్నారని, కాని ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి ఏళ్ల తరబడి ఆలోచించడం శోచనీయమన్నారు. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో మరుగు ఉండాల్సిందేన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల అక్కడి ఈగలు, దోమలు ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలపై వాలడం వల్ల వ్యాధుల బారిన పడక తప్పదని హెచ్చరించారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామాల్లో క్రైమ్ రేటు చాల తక్కువగా ఉందని ఓ సర్వేలో తేలిందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 12వేలు ప్రోత్సాహకం అందిస్తుందని, దీన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తే జిల్లా ప్రగతిని సాధించవచ్చన్నారు. అనంతరం ఎంపిపి దాసరి అనిత, జడ్పీటిసి బానోతు శారదలు మండల కేంద్రంలో ఎస్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. అంతకు ముందు మండల ప్రజాప్రతినిధులు కలెక్టర్ శ్రీదేవసేనకు శాలువాలు కప్పి మెమోంటోలు అందచేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి శ్రీనివాస్ కుమార్, ఎంపిడివో బానోతు సరిత, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, వైస్ ఎంపిపి మల్కపురం లక్ష్మయ్య, ఎంపిటిసిలు నర్సింహ, గవ్వాని నాగేశ్వర్, యమున, కొత్తపల్లి మోహన్, సురేందర్, సర్పంచ్‌లు సఫియాబేగం, విజయలక్ష్మీ, దుస్స వెంకన్న, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.