వరంగల్

విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 22: రైతులకు అవసరమైన విత్తనాల సరఫరా కోసం సీడ్ విలేజీలను ఏర్పాటుచేసేలా ఔత్సాహిక రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమ్రపాలి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఒక హెక్టారులో ఉత్పత్తి చేసిన విత్తనాలతో 40హెక్టార్లలో సేద్యం చేసేందుకు సరిపోతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాలలో ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి అవసరమైన విత్తనాల ఉత్పత్తికి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్‌హాలులో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక జిల్లా రైతులు పంటలు పూర్తిస్థాయిలో వేయలేదని, వేసిన పంటలలో కూడా దిగుబడి సరిగా రాలేదని, కానీ గతనెలలో భారీవర్షాలు కురిసిన కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని చెరువులు, కుంటలు నిండిన కారణంగా రబీలో పంటలు వేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందచేస్తున్న సమాచారాన్ని రైతులకు తెలియపరచాలని, రైతులకు సరఫరా చేసే విత్తనాలలో కల్తీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల విత్తనాలు, క్రిమిసంహారక మందులు మాత్రమే విక్రయాలు జరిగేలా, ఆయా కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులకు తెలిపారు.