వరంగల్

పర్యావరణ సమతుల్య లోపంతో ప్రపంచానికి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి, అక్టోబర్ 25: పర్యావరణ సమతుల్య లోపంతో భవిష్యత్తు సమాజం దెబ్బతినడంతో ప్రపంచానికి ముప్పు వాటిల్లనుందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. లండన్‌లో క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎనర్జీ ఇష్యూస్‌పై జరుగుతున్న ప్రపంచ సదస్సుకు భారతదేశం నుంచి బ్రిటీష్ హైకమీషన్ పిలుపు మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన పార్లమెంటు బృందం సోమవారం లండన్ చేరుకున్నారు. మంగళవారం రోజున మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని క్లైమేట్ పార్లమెంటు ఆధ్వర్యంలో పర్యావరణ సమతుల్యంపై జరిగిన ప్రపంచ సదస్సులో భారత బృందం తరపున ఎంపి రాపోలు ఆనందభాస్కర్ ప్రసంగించారు. పర్యావరణ భవితవ్యాన్ని పరిరక్షించుకోవడానికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ గల దేశాలు కార్బన రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యంతో నదులు ఉప్పొంగి జాతికి పెనుముప్పు సంభవించే అవకాశం ఉందన్నారు. వాతావరణంలో మార్పులతో వర్షాలు సమృద్ధిగా పడక వ్యవసాయ భూములు బీడుగా మారే వీలుందన్నారు. పర్యావరణ సమతుల్యం కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. కలిసొచ్చే దేశాలతో పర్యావరణ సమతుల్యంపై పోరాటం చేయడానికి భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. బ్రిటీష్ బిజినెస్ ఎనర్జీ ఇండస్ట్రీయల్ స్ట్రాటజీ శాఖ, కార్బన్ ట్రస్టు అండ్ క్లైమేట్ కె ఐసితో పర్యావరణ సమతుల్యంపై లోతైన అధ్యయనం చేయడానికి తమ దేశం సంసిద్ధంగా ఉందని చెప్పారు.