వరంగల్

ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు: సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి అక్టోబర్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మద్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, పెంచిన నిత్యావసర ధరలను నియంత్రించటంలో విఫలమయ్యాయని సిపిఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సిపిఐ నగర నిర్మాణ మహాసభలు కాశిబుగ్గలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చాడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని మరచి పాలనను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, 58జివొ ప్రకారం పేదప్రజలకు ఇళ్లస్థలాల పట్టాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు నవంబర్ 28నుండి 30వ తేదీవరకు వరంగల్ నగరంలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్రాములు, పోతరాజు సారయ్య, రాజారెడ్డి, జ్యోతి, కరుణాకర్, లింగారెడ్డి, రవి, ప్రసాద్, సదానందం పాల్గొన్నారు.