వరంగల్

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, అక్టోబర్ 25: జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న రిజర్వాయర్లు, కాలువలు, ట్యాంకుల నిర్మాణం కోసం కావాల్సిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జనగామ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. జనగామ కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జిల్లా పరిధిలోని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు ఏ దశలో ఉన్నాయని వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ సందర్భంగా అధికారులకు రైతులతో ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే తెలియచేయాలని కోరారు. ప్రభుత్వం అందచేసే ధరను రైతులు అంగీకరించని పక్షంలో జీవో నెంబర్ 123 ప్రకారం రైతులకు పబ్లికేషన్ నోటీసులు అందచేయాలని కోరారు. భూములు కోల్పోతున్న గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, స్పెషల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లత, డిప్యూటీ కలెక్టర్ హరిప్రీత్‌సింగ్ గోపాల్, దేవాదుల ఈఈలు పాల్గొన్నారు.